Tirumala | రేప‌టి నుంచి తిరుమ‌ల శ్రీవారి పుష్క‌రిణి మూసివేత …

తిరుమల – శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు ప‌నులు రేప‌టి నుంచి ప్రారంభించ‌నున్నారు.. ఈ పనులు వ‌చ్చే నెల 19వ తేది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని టిటిడి అధికారులు వెల్ల‌డించారు. శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహించ‌డం అన‌వాయితి. ఈ ఏడాది సెప్టెంబరు 24 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. రిపేర్ నేప‌థ్యంలో ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండద‌ని తెలిపారు అధికారులు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించబోర‌ని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..

భక్తిప్రభ వార్తలను చదవండి

Leave a Reply