WGL | విద్యుత్ షాక్ తో లైన్ మెన్ కు తీవ్రగాయాలు

పర్వతగిరి, జూన్19(ఆంధ్ర ప్రభ) : మండల పరిధిలోని జమాల్ పురం (Jamal Puram) గ్రామంలో లైన్ మెన్ బాధవత్ బాలు విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవ‌శాత్తు కరెంట్ సరఫరా కావడంతో షాక్ కు గురై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం వరంగల్ (Warangal) యంజియం హాస్పిటల్ కి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ (Hyderabad) కు తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply