ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజ్..
ఇల్లెందు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సోమవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ.. డీఎస్పీ వెంకన్నబాబుతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పోలీస్ స్టేషన్ పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో అమర్యాదగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్హెచ్ఓ సురేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
