జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ..
బ్యాంక్ మేనేజర్ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
సూర్యాపేట ఆంధ్రప్రభ ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంతకాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకు మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ ఫోర్జరీ చేశారు. డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ల జాయింట్ బ్యాంకు అకౌంట్ లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంతకాలను ఫోర్జరీ చేయగా, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఈనెల 16న చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సదరు నిందుతున్ని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

గోప్యత వెనుక కారణాలేంటో …
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా… ఈ విషయంపై వివరాలు చెప్పేందుకు పోలీసులు, సంబంధిత అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితున్ని చట్ట ప్రకారం అరెస్టు చేసిన విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేంత గొప్యత పాటించాల్సిన అవసరం ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతుంది.
