నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు
అభివృద్ధి పథంలో పెద్దపల్లి జిల్లా
ప్రభుత్వ విప్ విజయ రమణారావు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు తెలియజేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 2023లో అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం పనిచేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుందని, అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనా అన్నారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డిసిపి రామ్ రెడ్డి తోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
