త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య భారత్: ఆర్డీవో గణేష్
తొర్రూరు రూరల్ (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని తొర్రూరు ఆర్డీవో గణేష్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ కృష్ణ నేతృత్వంలో పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల క్రమశిక్షణతో కూడిన గౌరవ వందనం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఆర్డీవో గణేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థులు బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేసి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో తొర్రూరు తహశీల్దార్, ఎంపీడీవో, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
