జన్నారంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విద్యార్థుల ప్రభాతబేరి.. పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
జన్నారం (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
జన్నారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బక్కయ్య, ఎఫ్డీఓ కార్యాలయంలో ఎఫ్డీఓ రామ్మోహన్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ లక్ష్మీనారాయణ, కొనుగోలు సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ అల్లం రవి, రాఘవేంద్ర లిటిల్ హన్స్ పాఠశాల వద్ద చైర్మన్ చంద్రశేఖర్, స్లేట్ స్కూల్ వద్ద చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, పొనకల్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచి జక్కు సుష్మ జాతీయ జెండాలను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు నందు నాయక్, అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద బీజేపీ అధ్యక్షుడు మధుసూదన్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజారాం రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు వి. వామన్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు జక్కు భూమేష్, టౌన్ అధ్యక్షుడు రాజేష్ తదితరులు జెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు ప్రభాతబేరి నిర్వహించి ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం పలు పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
