యూపీఐ సేవల్లో అంతరాయం..
- నిలిచిపోయిన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం !
ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా యూపీఐ ఆధారిత ఆన్‌లైన్ చెల్లింపు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి ప్రముఖ చెల్లింపు యాప్‌ల ద్వారా లావాదేవీలు జరపడంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలామంది సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.
యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో పిన్ నమోదు చేసిన తర్వాత లావాదేవీ పూర్తికాకుండా ఎక్కువ సమయం లోడింగ్‌లోనే ఉంటోందని వినియోగదారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఖాతా నుంచి కట్ అయ్యాయా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ అవసరాల నుంచి అత్యవసర చెల్లింపుల వరకు డిజిటల్ చెల్లింపులపై ఆధారపడుతున్న సమయంలో ఇలాంటి అంతరాయాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు.
