57 నెలలుగా నిరంతర అన్నదానం

పేదల ఆకలి తీరుస్తున్న కళ్ళే లలిత ట్రస్ట్

పాయకాపురం, ఆంధ్రప్రభ: సమాజ హితం కోసం పాటుపడే వారికి దేవుడు మానవ రూపంలో వచ్చి ఆశీర్వదిస్తారని అనడానికి ప్రతినెలా స్వర్గీయ కళ్ళే లలిత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్బహించే ఉచిత అన్నదానమని వేనోళ్ల ప్రజలు కొనియాడతున్నారు. అజిత్ సింగ్ నగర్ స్వర్గీయ కళ్ళే లలిత వీధిలో కళ్ళే లలిత ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కళ్ళే నాగేశ్వరరావు పాల్గొని కళ్ళే లలిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా కళ్ళే నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ కళ్ళే లలిత భౌతికంగా దూరమైన నాటి నుండి ప్రతి నెల 12వ తేదిన క్రమం తప్పకుండా గత 57నెలలు నుండి పేదలకు సింగ్ నగర్ ప్రాంతంలోని కళ్ళే లలిత వీధి వద్ద అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తమకు కలిగిన ఆర్ధిక స్థోమత బట్టి పేదలకు ఆహారాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు.కళ్ళే లలిత బ్రతికి ఉన్న రోజులలో పేదల ఆకలి తీర్చాలని తెలపడం జరిగిందని అందుకే ప్రతి నెల వారికి బోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కళ్ళే నాగేశ్వరరావు అన్నారు.

అంతే కాకుండా కళ్ళే లలిత ట్రస్ట్ సేవలు ద్వారా పేదల చదువుల నిమిత్తం స్కాలర్షిప్ ఇవ్వడం, సైకిల్ అందజేయడం, నిరంతరం 365రోజులు పాటు చల్లని కూలింగ్ ఫ్రిజ్తో కూడిన చలివేంద్రం ఏర్పాటు,శానిటేషన్ సిబ్బందికి వస్త్రాలు,చెత్త సేకరణకు డస్ట్ బిన్స్ ఇవ్వడం, రోగులకు ఉచిత మెడిసిన్, భోజనాలు, పేద మహిళల జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మున్ముందు మరింత సహాయ సహకారాలు ట్రస్ట్ ద్వారా అందిస్తామని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో డైరెక్టర్లు కళ్ళే సీతా మహాలక్ష్మిముప్పూరి హరీష్, ఎమ్.జశ్విన్,జి. ధ్రువన్,అనిల్,ప్రసాద్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.