న్యాయవాదిపై దాడికి నిరసనగా..
మక్తల్ కోర్టులో లాయర్ల విధుల బహిష్కరణ
న్యాయవాదులకు రక్షణ కల్పించాలి..
దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
మక్తల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ బార్ అసోసియేషన్ న్యాయవాది ఎం. వేణుగోపాల్రావుపై దాడికి నిరసనగా మక్తల్ కోర్టులో బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అనంతరం కోర్టు ఎదుట నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ న్యాయవాదులపై వరుసగా దాడులు జరుగుతుండటం ఆందోళనకరంగా ఉందన్నారు. పెంట్లవెల్లిలో న్యాయవాది హత్య, తాజాగా మరో న్యాయవాదిపై దాడి ఘటనలు కలచివేస్తున్నాయని పేర్కొన్నారు.
న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఆడెం శ్రీనివాసులు, డి. దత్తాత్రేయ, బండారి శ్రీనివాసులు, పసుల నీరజ్, రంకుల ఆనంద్, కె. సూర్యప్రకాశ్, వెంకటేష్‌గౌడ్, సురేందర్ ఆచారి, సతీశకుమారి తదితరులు పాల్గొన్నారు.
