బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ

జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ

చిట్యాల, ఆంధ్రప్రభ : భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో చిట్యాల మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం”, “జై హింద్” అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు.

యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందించడంతో పాటు, ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ తిరంగా ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, దేశభక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రావుల రాకేష్, మైదం శ్రీకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య, గజనాల రవీందర్, గుండ సురేష్, ఓదెల శ్రీహరి, నగవత్ పూర్ణ, మండల ఉపాధ్యక్షుడు నల్ల శ్రీనివాస్ రెడ్డి, కేంసారపు ప్రభాకర్, వల్లాల ప్రవీణ్, చందు, కల్వచర్ల కిషోర్, రాయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.