బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన
ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచన
బెజ్జంకి, ఆంధ్రప్రభ : పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ టి. తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫిషింగ్, నకిలీ లింకులు, మోసపూరిత ఫోన్ కాల్స్, సైబర్ వేధింపులు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తదితర అంశాలను వివరించారు.
వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోరాదని, బలమైన పాస్‌వర్డ్‌లను వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను క్లిక్ చేయవద్దని తెలిపారు. ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
విద్యార్థులకు “అప్రమత్తంగా ఉండండి – సురక్షితంగా ఉండండి – క్లిక్ చేసే ముందు ఆలోచించండి” అనే సందేశాన్ని అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎ. దేవస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని విద్యార్థి కౌన్సిలర్ టి. రాజా రామణ రావు సమన్వయం చేశారు. ఎన్. శివకుమార్, ఎం.వి. నాగేశ్వర్, ఎస్. ప్రవీణ్ రెడ్డి, ఎ. మురళి, బాల భాస్కర్ తదితర బోధనా సిబ్బంది పాల్గొన్నారు.
