Trump-007 : ట్రంప్‌కు ఇరాన్ భయం..! Andhra Prabha Top Story

Trump-007 : ట్రంప్‌కు ఇరాన్ భయం..! Andhra Prabha Top Story

  • క్యాటరింగ్ వ్యాన్..
  • సీక్రెట్ ఫ్లైట్..
  • సీక్రెట్ ఎస్కేప్
  • అసలేం జరిగింది?
  • మిఫ‌న్ ట‌ర్కీ మిస్ ఫైర్
  • ద‌క్క‌ని అమెరికా సానుభూతి

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వాఫింగ్ట‌న్)

ఒక‌ప్పుడు ఏజెంట్ 007 పాత్ర‌లో సినీ ప్రేమికుల మ‌దిని దోచిన రోనాల్డ్ రీగ‌న్ అమెరికా అధ్య‌క్షుడ‌య్యారు. అమెరికా తాజా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ .నిజ‌జీవితంలో ఏజెంట్ 007 గా అవ‌త‌రించి…ర‌హ‌స్య విమానంలె శ‌త్రులుకు దొర‌కుండా. త‌ప్పించుకుని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీని గుర్తు చేశారు. కానీ ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌టంతో.. అమెరికా ప్ర‌జ‌లు అస‌లు స‌హించ‌టం లేదు. శ‌త్రేవు నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌నే సాసుభూతిని ప్ర‌ద‌ర్శించ‌టం లేదు. ఏకంగా జాతీయ భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ తీరుతెప్పుపై మండి ప‌డుతున్నారు. అదే.. నెల రోజుల కింద‌ట అమెరికా అధ్య‌క్షుడు డోనాడ్డ్ ట్రంప్ ను చంప‌టానికి ఇరాన్ స్కెచ వేసిన‌ట్టు అంత‌ర్జాతీయ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇదంతా ట్రంప్ ఎల‌శ్రీ‌న్ స్టంట్ గా ప్ర‌తిప‌శ్రీ పార్టీ కొట్టిపారేసింది. కానీ.. ఇరాన్ త‌న‌ను చంపేస్తుంద‌నే భ‌యంతో.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ ర‌హ‌స్య విమానంలో త‌ప్పించుకున్నారు. అదీ ఒక విమానం నుంచి ఓ క్యాట‌రింగ్ వ్యాన్ ద్వారా మ‌రో విమానంలో త‌ప్పించుకున్నారు. ఇరాన్ పన్నిన ఒక పెద్ద కుట్రలో భాగంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ఒక క్యాటరింగ్ ట్రక్కులో దాక్కుని ప్రత్యామ్నాయ సైనిక విమానం ఎక్కి, టర్కీ నుండి రహస్యంగా త‌ప్పించుకున్నార‌ని ఒక అమెరికా అధికారి బ‌య‌ట పెట్టారు. ఇరాన్ చేతిలో ట్రంప్ హత్యకు గురికాకుండా కాపాడటానికి అమెరికా అధికారులు ఎంతగా ప్రయత్నించారో ఈ రహస్య భద్రతా ప్రణాళిక నిజ‌మేన‌ని నిరూపించింది. ఖ‌తార్ ప్ర‌ధానం చేసిన బహుమతి… ఎయిర్ ఫోర్స్ వన్‌గా అవ‌త‌రించిన ఒక కొత్త విమానంలో టర్కీకి ట్రంప్ వెళ్లారు. కానీ ఆయన పర్యటనలో ఉండగా, భద్రతా కారణాల దృష్ట్యా పాత అధ్యక్ష విమానంలో ఆయ‌న ప్రయాణిస్తారని అక‌స్మికంగా అధికారులు ప్రకటించారు. . అది కూడా ఈ కుట్రలో ఒక భాగమేనని స్పష్టమవుతోంది. పాత విమానం ఎక్కిన తర్వాత, కెమెరాలో రికార్డింగ్ స‌మ‌యంలో.. ఒక క్షణంలో ట్రంప్ రహస్యంగా క్యాటరింగ్ వాహనంలో కిందకు దిగి, చిన్న ఎయిర్ ఫోర్స్ C-32A విమానంలోకి మారారు. ఆ తర్వాత ఖతార్ బహుమతి విమానం, పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానం C-32A విమానం అన్నీ వేర్వేరుగా యూకేకు బయలుదేరాయి. అక్కడికి చేరుకున్నాక, ఖతార్ బహుమతి విమానంలో ట్రంప్ స్వదేశానికి తిరిగి చేరుకున్నారు.

Trump-007 : ఆరోజు ఏమి జ‌రిగింది?

అధ్యక్షుడితో పాత్రికేయుల బృందం (ప్రెసిడెన్షియల్ ట్రావెల్ పూల్) స‌మాచారం ప్ర‌కారం, కీలక NATO శిఖరాగ్ర సమావేశం తర్వాత టర్కీ నుండి ట్రంప్ బయలుదేరిన త‌రువాత ఆయ‌న చుట్టూ జరిగిన అసాధారణ ఘటనల గురించి మరింత స్పష్టత క‌నిపిస్తుంది. .
ఈ నివేదిక ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:43 గంటలకు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ గాల్లోకి లేచింది. ప్రెస్ క్యాబిన్‌లోని కిటికీ తెరలను మూసి వేయాల‌ని ఆ బృందానికి సూచించారు. ఇది చాలా అసాధారణ విషయం . భద్రతా పర పరిస్థితిని సూచించేలా అనిపించింది; దీనిపై ట్రంప్ మాట్లాడుతూ, బహుశా మీరు ప్రమాదకర విమాన ప్రయాణంలో ఉండటానికి నీచులే కారణం” అని అన్నారు.

Trump-007 : సీక్రెట్ ఏజెంట్ ఎంట్రీ

వెలుగులోకి వచ్చిన విమానం రహస్య సమాచారం ప్ర‌కారం, కిటికీ తెరలను మూసి ఉంచాలని మీడియాకు గుర్తు చేయడానికి ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ప్రెస్ క్యాబిన్‌కు తిరిగి వచ్చారు. ఒక ఫోటో గ్రాఫర్ తెరను పైకి లేపడానికి ప్రయత్నించినప్పుడు, దానిని వెంటనే కిందకు దించాలని చెప్పారు. కారణం ఏమిటని వైట్ హౌస్ సిబ్బందిని మీడియా అడిగినప్పుడు, అది సీక్రెట్ సర్వీస్ నుండి వచ్చిన అభ్యర్థన అని చెప్పారు.

Trump-007 : ఇక్క‌డే. మిస్ట‌రీ

విమానం టేక్ ఆఫ్ కు సుమారు ఏడు నిమిషాల ముందు, అంకారాలోని ఎసెన్‌బోగా విమానాశ్రయంలో ‘ఎయిర్ ఫోర్స్ వన్’ పక్కన ఒక క్యాటరింగ్ ట్రక్ నిలిచి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:29 గంటలకు ఆ విమానం ఇంగ్లాండ్‌లోని RAF మిల్డెన్‌హాల్‌లో దిగింది. కానీ, అధ్యక్షుడు విమానం దిగుతున్న దృశ్యాన్ని చిత్రీకరించడానికి విమానం రెక్క కింద నుండి కెమెరా కోణాన్ని (underwing shot) ఏర్పాటు చేయ‌ట‌టానికి దాదాపు 20 నిమిషాల సమయం పట్టింది.అది అసాధారణ‌ సమయం కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించే లోపే, ట్రంప్ చిన్న విమానం నుండి దిగి తిరిగి ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోకి ఎక్కడానికి సరిపోయేంత సమయం అది. విమానం చక్రాలు కిందకు దిగినప్పటి నుండి రెక్క కింద నుండి తీసే షాట్‌ను ఏర్పాటు చేయడానికి సుమారు ఎనిమిది నిమిషాల సమయం ప‌డుతుంది. .విమానం కింద పూల్ సిబ్బంది సమావేశమైన తర్వాత, అధ్యక్షుడు విమానం నుండి దిగడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. సాధారణంగా, మొదటి ఎయిర్ ఫోర్స్ వన్ తలుపు తెరుచుకోవడానికి అధ్యక్షుడి కోసం మెట్లు అమర్చడానికి ముందే పూల్ సిబ్బంది తమ స్థానాల్లో సిద్ధంగా ఉంటారు. మిల్డెన్‌హాల్ నుండి వచ్చిన పూల్ వీడియోను ప‌రిశీలిస్తే పూల్ షాట్ సమయానికి మెట్ల బండి అప్పటికే సిద్ధంగా ఉంది. విమానం తలుపు తెరుచుకుని కనిపించింది. ఎక్కువ మంది భద్రతా సిబ్బంది టార్మాక్‌పై క‌నిపించారు. పూల్ నోట్స్ ప్రకారం, ట్రంప్ తర్వాత రాత్రి 11:01 గంటలకు కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ (ఖ‌తార్ బ‌హుమ‌తి) విమానం ఎక్కారు. అధ్యక్షుడు ఒక విమానం నుండి మరొక విమానంలోకి నడుస్తున్న దృశ్యాలను పూల్ సిబ్బంది వీడియో తీశారు. అంటే.. అమెరికా అధ్య‌క్షుడు ఇరాన్ హెచ్చ‌రిక‌ల‌కు అదిరిపోయారు. బెద‌రిపోయి క్యాట‌రింగ్ వ్యాన్ ద్వారా మ‌రో విమానంలోకి త‌ప్పించుకున్నార‌ని.. ఈ వీడియోలు నిరూస్తున్నాయి.

Trump-007 : వైట్ హౌస్ వివ‌ర‌ణ

గత నెల రోజులుగా,ఈ విమానాల మార్పిడి పై అమెరి జ‌నం చర్చలో అధిక భాగం ఖతార్ విమానం భద్రతా సామర్థ్యాలపైనే మొత్తం చ‌ర్చ జ‌రిగింది. ఆ కొత్త విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్‌గా సేవలు అందించేందుకు అవసర మార్పులు చేయాల్సి వచ్చినందున, అది ఇతర విమానాలంత సురక్షితం కాదని అధికారులు భావించినప్పటికీ, ఖ‌త‌ర్ బ‌హుమ‌తికే ట్రంప్ పెద్ద పీట వేశారు. అస‌లు లోపాలపై వచ్చిన వార్తలపై అధ్యక్షుడు అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గతంలో మీడియా ఏకి పారేసింది. ఇప్పుడు, ఒక నకిలీ విమానంలో ప్రయాణిస్తున్న విలేకరులు సిబ్బంది విషయంపై, ఇంతటి నాటకీయ భద్రతా చర్యలకు దారితీసిన ముప్పు స్వభావంపై అమెరికా ప్ర‌జ‌ల దృష్టి మళ్లేంది.

Trump-007 : ఈ దాగుడు మూత‌ల‌పైనే

రహస్యంగా విమానాలను మార్చిన అంశంపై , వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెంగ్ మాట్లాడుతూ, “కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ ఒక అత్యాధునిక విమానం. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది భద్రతను నిర్ధారించే ఉన్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్‌లతో దీనిని అమర్చారు. అధ్యక్షుడు ఇటీవల చెప్పినట్లుగా, అమెరికాపై కన్నేసిన శత్రువులు చాలా మంది ఉన్నారు, ఆ ముప్పులను ఎదుర్కోవడానికి మా వద్ద ఉన్న ప్రతి సాధనాన్ని ఉపయోగిస్తాం, అని స్టీవెన్ చెంగ్ వివ‌రించారు. కాపిటల్ హిల్‌లో నిఘా విభాగాన్ని పర్యవేక్షించే అగ్రశ్రేణి చట్టసభ సభ్యులు ‘గ్యాంగ్ ఆఫ్ ఎయిట్’కు ఈ ఘటన గురించి సమాచారం ఇవ్వలేదని, అధ్యక్షుడి కదలికల నిర్వహణలో కాంగ్రెస్ లోతుగా జోక్యం చేసుకోదని ఒక డెమోక్రటిక్ జాతీయ భద్రతా సహాయకుడు తెలిపారు. ష‌ఈ ఘటన గురించి కాకపోయినా, ముప్పు గురించి కాంగ్రెస్‌కు తెలియజేసి ఉండాల్సింది,” అని ఆ సహాయకుడు అన్నారు. కాంగ్రెస్ “తన రాజ్యాంగ అధికారాన్ని పునరుద్ఘాటించి” ఇరాన్ ఘర్షణను ఎందుకు ముగించాలో ఈ ఘటన స్పష్టం చేసిందని సెనేట్ మైనారిటీ నాయకుడు చెక్్ షూమ‌ర్ అన్నారు. “కాంగ్రెస్‌ను చీకట్లో ఉంచి, ఈ తీవ్ర ముప్పు గురించి పత్రికా నివేదికల ద్వారా తెలుసుకోవడం ఆమోదయోగ్యం కాదు,” అని షూమర్ అన్నారు. “అనవసర నిర్లక్ష్యపూరిత యుద్ధంలోకి దిగడం ద్వారా అమెరికా పిల్ల‌ల‌ను ప్రమాదంలోకి ట్రంప్ నెట్టారు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్‌కు, ప్రజలకు పారదర్శకతను అందించడానికి పదేపదే నిరాకరించింది.అని షూమ‌ర్ ఆరోపించారు.

Trump-007 : ట్రంప్ విశ్లేష‌ణ ఇది

బ్రిటిష్ స్థావరంలోని అమెరికా సైనికులకు “విమానాన్ని సందర్శించే అవకాశం” ఇవ్వడానికే ఈ మార్పు చేశామని ట్రంప్ చెప్పారు. మరేమైనా సమస్యలు ఉన్నాయా అని పదేపదే అడగ్గా, ట్రంప్ వెంటనే “ఎలాంటి సమస్యలు లేవు” అని బదులిచ్చారు. విమానంలోని కిటికీ తెరలను దించాలని విలేకరులకు ఎందుకు సూచించారని కూడా ట్రంప్‌ను అడిగారు. ఎందుకంటే బహుశా ప్రమాదకర ప్రయాణంలోమీరు ఉన్నారు” అని ఆయన చెప్పారు. “నా కిటికీ తెరలను మూయమని నన్ను అడగలేదు, కానీ ఒకవేళ అడిగి ఉంటే, నేను మూసేవాడిని,” అని ట్రంప్ అన్నారు.”కానీ నేను వెళితే, మీరు కూడా వెళ్ళాలి. కదా?” అని ట్రంప్ అన్నారు. “బహుశా ఎప్పుడో ఒకరోజు మీరు కూడా వృత్తి మార్చుకోవాలనుకోవచ్చు.” చివరకు ట్రంప్ మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విమానాన్ని దించి, అధ్యక్ష లిమోసిన్‌లోకి వెళ్లే ముందు, తూర్పు కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:23 గంటలకు ఎయిర్ ఫోర్స్ వన్ నుండి బయటకు వచ్చారు.