గరగపర్రులో గ్రామ దేవతలకు ఆషాడ సారే..

భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

పాలకోడేరు, ఆంధ్రప్రభ: పాలకోడేరు మండలం గరగపర్రులో వేంచేసి ఉన్న పల్లాలమ్మ, బర్రింకలమ్మ వారికి ఆషాడ సారెను గ్రామంలోని భక్తులు సమర్పించారు. అమ్మవారికి సమర్పించే ముందు గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆషాడ సారెను సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు గ్రామంలో నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని కనకదుర్గమ్మకు ఆషాడ సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు, ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.