విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఎద్దు మృతి
కమలాపూర్ ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ శివారులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌కు గురై ఓ ఎద్దు మృతి చెందింది. ఈ ఘటనలో రైతుకు ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కానిపర్తి గ్రామానికి చెందిన కోడిగుటి కుమార్‌స్వామి పొలంలో శంభునిపల్లి గ్రామానికి చెందిన కందుల మల్లయ్య వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లాడు. రెండు ఎద్దులతో బురద గొర్రు తోలుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
