చెన్నూరులో వామపక్షాల జైల్‌ భరో

చెన్నూర్, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన జైల్‌ భరో పిలుపులో భాగంగా సోమవారం చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో వామపక్ష నాయకులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కార్మిక చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నాయకులు ఆరోపించారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.