పేద కుటుంబానికి రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేత
చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన నెన్నెల చిన్న రాజం మెదడులో రక్తం గడ్డకట్టడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు విషయాన్ని మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి బాధితుడి వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం చెన్నూరులోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు. తమ కుటుంబానికి వైద్య సాయం అందేలా చర్యలు తీసుకున్న మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
