AP | మంత్రి ప్రజాదర్బార్…
అనంతపురం బ్యూరో, ఆగస్టు 10 (ఆంధ్రప్రభ) : అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక,వాణిజ్య పన్నులు, శాసనసభవ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా పరిశీలించారు. సమస్యల వివరాలను సంబంధిత వ్యక్తుల నుంచి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లోనే మాట్లాడి…ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకువచ్చేలా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం పట్ల ప్రజలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిశీలిస్తూ… సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపించడమే లక్ష్యంగా మంత్రి పయ్యావుల కేశవ్ ముందుకు సాగుతున్నారు. అనంతపురం రామ్‌నగర్‌లో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
