డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ముడుగు స్వాముల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు ముడుగు స్వాముల్ డీటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం తెలిపారు.

హైదరాబాద్‌లోని ఎన్జీవో భవన్‌లో జరిగిన రెండు రోజుల రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కమిటీలో తనకు రాష్ట్ర కార్యదర్శి పదవి అప్పగించినట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించిన రాష్ట్ర సంఘం నాయకులకు ముడుగు స్వాముల్ కృతజ్ఞతలు తెలిపారు.