విద్యుత్‌ షాక్‌తో కాంట్రాక్టు లేబర్‌ మృతి

పెంచికల్‌పేట్, ఆంధ్రప్రభ : పెంచికల్‌పేట్‌ మండలం గొంట్లపేట–మొట్లగూడ బస్టాండ్‌ వద్ద సోమవారం విద్యుత్‌ పనులు చేస్తుండగా చందు అనే కాంట్రాక్టు లేబర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చందును స్థానికులు వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మృతదేహాన్ని కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.