నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో ఉపరాష్ట్రపతి పర్యటన

  • చారిత్రక ప్రదేశాలను సందర్శించిన సీపీ రాధాకృష్ణన్

ఆంధ్రప్రభ: అండమాన్‌ నికోబార్‌ దీవుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు చారిత్రక ప్రదేశాలను పరిశీలించారు.

1943 డిసెంబర్‌లో అండమాన్‌ దీవులకు వచ్చిన సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ బస చేసిన భవనాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం అక్కడి చర్చి, సైనికుల బ్యారక్స్‌, గన్‌ పాయింట్‌ ప్రాంతం, స్మృతికా మ్యూజియంను పరిశీలించారు.

ఈ సందర్భంగా దీవుల చారిత్రక ప్రాధాన్యత, స్వాతంత్య్ర ఉద్యమంతో వాటి అనుబంధం, భవిష్యత్‌ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులు ఉపరాష్ట్రపతికి వివరించారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల వారసత్వ సంపదను పరిరక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.