ఆషాఢ సారె సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, ఆంధ్రప్రభ: ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో కొలువైన శ్రీ గోగులమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మీ తల్లి, శ్రీ సత్తెమ్మ తల్లిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సకల శుభాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించారు.

ఆధ్యాత్మికతకు, భక్తిభావానికి ప్రతీకగా నిలిచే ఇలాంటి పర్వదినాలు మన సంప్రదాయాలు, సంస్కృతిని మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. అమ్మవార్ల కృపాకటాక్షాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.