రెడ్డి కాలనీలో హెల్త్ క్యాంప్

ఆరోగ్యమే మహాభాగ్యం: కార్పొరేటర్ లక్ష్మీ దుర్గ

మంచిర్యాల, ఆంధ్రప్రభ : ఆరోగ్యమే మహాభాగ్యమని కార్పొరేటర్ లక్ష్మీ దుర్గ అన్నారు. శుక్రవారం రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌లో పాల్గొని కార్పొరేటర్ మాట్లాడుతూ.. పాత మంచిర్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం హర్షనీయమన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పట్టణంలో ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన మేరకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంజీవ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాలనీ అధ్యక్షులు పడాల లింగారెడ్డి, నాయకులు ఇడగొట్టు హనుమంతు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.