Sensex | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…

ఒత్తిడిలో సెన్సెక్స్, నిఫ్టీ


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ప్రారంభ ట్రేడింగ్‌లోనే సూచీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడిదారులు అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహంపై దృష్టి సారించారు.

ఈ ఉదయం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 266 పాయింట్లు కోల్పోయి 78,684 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,602 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా అమెరికా డాలర్ ఇండెక్స్ 99.97 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 83.4 డాలర్ల వద్ద ఉండగా, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.68 శాతానికి చేరింది. ఈ పరిణామాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

మరోవైపు అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్‌లో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.18 శాతం, నాస్‌డాక్ 0.06 శాతం తగ్గడంతో ఆసియా మార్కెట్లపై కూడా ప్రభావం కనిపిస్తోంది.