ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా

జయశంకర్ ఆశయాలు చిరస్మరణీయం: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను చౌటుప్పల్ పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

పురపాలక సంఘ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి “జోహార్ జయశంకర్ సార్” అంటూ ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన ఆచార్య జయశంకర్ సేవలు, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన దిశానిర్దేశం ఎప్పటికీ మరువలేనివని అన్నారు.

జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, ఊదరి యాదయ్య, కొయ్యడ శేఖర్ గౌడ్, బద్రి గాలయ్య, బత్తుల వాణి విప్లవ్, బత్తుల జయమ్మ దాసు, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పిల్లలమర్రి మధుసూదన్, మహమ్మద్ హన్ను, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగా రాములు, సందగళ్ళ విజయ సతీష్, షేక్ నబీబి జానీబాబ, బాబా షరీఫ్, పలువురు నాయకులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.