మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలి

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా ఐటీ కన్వీనర్ తుమ్మల శ్రీకుమార్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు కొండపల్లి బీజేపీ కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 14 వరకు జరగనున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

బూత్ కమిటీల ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సమావేశానికి బీజేపీ పట్టణ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి అధ్యక్షత వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేగళ్ల రఘునాథరెడ్డి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు దాము భవాని, సేనాపతి నాగమణి, నగీనా, తిరుపతమ్మ, స్వాతి, కృష్ణమోహన్, సత్యవతి, యుగంధర్, పరమేష్, వెంకట రమణ, నరసింహారావు, పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.