జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి

జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జయశంకర్ సార్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, ఉద్యమానికి చూపిన దిశ, జీవితాంతం చేసిన త్యాగం తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే దిశగా జయశంకర్ సార్ చూపిన మార్గంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనే ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.