‘చాయ్ బాగుందయ్యా మహేష్’..ఎమ్మెల్యే ప్రశంసలు
టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (జీఎస్సార్) టేకుమట్ల మండల పర్యటన సందర్భంగా స్థానికంగా మహేష్ తయారు చేసిన చాయ్‌ను ఆస్వాదించారు. చాయ్ రుచి చూసిన ఎమ్మెల్యే, “చాయ్ చాలా బాగుంది మహేష్” అంటూ ఆయనను అభినందించారు. తన పనిపై అంకితభావంతో నాణ్యతను పాటిస్తూ రుచికరమైన చాయ్ అందిస్తున్నందుకు మహేష్‌ను ప్రశంసించారు.
ఎమ్మెల్యే ప్రశంసలతో మహేష్ ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులోనూ ఇదే నాణ్యతను కొనసాగిస్తానని తెలిపారు. అక్కడున్న స్థానికులు కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలను స్వాగతిస్తూ మహేష్‌ను అభినందించారు.
