ఆరుతడి పంటలే శ్రేయస్కరం
అవుకు రూరల్, ఆంధ్రప్రభ: ఎల్నినో ప్రభావంతో ఆరు తడి పంటలే సాగుకు శ్రేయస్కరమని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ ప్రాంతీయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో అవుకు మండలంలోని కొండమనాయుని పల్లి,కునుకుంట్ల, సుంకేసుల గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. కోవెలకుంట్ల ఏడిఏ సుధాకర్, ఏవో కలీ మున్నీసా వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం బెట్ట పరిస్థితులపై సాగు చేసిన పంటలను ఎలా కాపాడుకోవాలనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. బెట్ట పరిస్థితిల్లో మినుము పంట నీటి ఎద్దడిని తట్టుకోవాలంటే పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 ను పిచికారి చేసి మినుము పంటను రక్షించుకోవచ్చన్నారు. వ్యవసాయ అధికారులు సుధాకర్, నీలిమ, రాఘవేంద్ర, ప్రొఫెసర్ మాధవి, లక్ష్మి,నాగ ప్రసాద్ వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
