Alert | మరికొద్ది సేపట్లో భారీ వర్షం..
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నగర వాసులకు అలర్ట్ ! హైదరాబాద్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. సాయంత్రం 6:30 గంటల వరకు నగరంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండగా, పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.
సాయంత్రం కార్యాలయాల నుంచి ప్రజలు ఇళ్లకు తిరిగివెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పలు రహదారులపై నీరు నిలిచే అవకాశముండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం 7 గంటల వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితులు మినహా అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
