AP | జగన్ ర్యాలీలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు బోర్డు వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ శ్రేణులు ఒక్కసారిగా బోర్డు ప్రధాన గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

భారీ సంఖ్యలో కార్యకర్తలు ఒకేసారి ముందుకు దూసుకెళ్లడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఓ ఎస్సైతో పాటు పలువురు పోలీసు సిబ్బంది, వైసీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ర్యాలీని కొనసాగించారు.