శాయంపేటలో 6న సర్వసభ్య సమావేశం
శాయంపేట, ఆంధ్రప్రభ: శాయంపేట మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఫణిచంద్ర తెలిపారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు సకాలంలో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో ఫణిచంద్ర కోరారు.
