Missing meghana | సస్పెన్స్‌తో వస్తున్న కొత్త సినిమా..!
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: సస్పెన్స్, ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి హీరోహీరోయిన్‌గా నటిస్తున్నారు. సస్పెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాన్ని నరేష్‌బాబు పంచుమర్తి నిర్మిస్తుండగా, దీవెల శ్రీనివాసరావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను వన రాజ్ అందించారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ఆర్.ఆర్. ధృవన్ సంగీతాన్ని అందించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. ‘మిస్సింగ్ మేఘన’ కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదని, ప్రేక్షకులను ఆలోచింపజేసే బలమైన భావోద్వేగాలతో కూడిన కథాంశమని తెలిపింది. ప్రతి మలుపు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచేలా, చివరి వరకు కథపై ఆసక్తిని నిలబెట్టేలా రూపొందించామని పేర్కొంది.
హీరోహీరోయిన్ల నటన, వాచస్పతి దర్శకత్వానికి తోడు వన రాజు అందించిన కథ–స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి వెన్నెముకగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ప్రతి మలుపులో ఉత్కంఠను పెంచుతూ, చివరి వరకు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఆయన కథనాన్ని అల్లారని తెలిపింది. థ్రిల్లింగ్ అంశాలకు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను జోడించి, విభిన్నమైన అనుభూతిని అందించేలా స్క్రీన్‌ప్లే రూపొందించారని ప్రశంసించింది.
సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు హృదయాన్ని తాకే ఎమోషన్స్‌తో రూపొందుతున్న ‘మిస్సింగ్ మేఘన’పై సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. పోస్టర్ చిత్రంపై మరింత అంచనాలు పెంచేసింది.

