కేటీఆర్ నుంచి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
పార్టీకి మీ సేవలు అమోఘం, అద్వితీయం అని ప్రశంసించిన కేటీఆర్
కరీమాబాద్, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జన్మదినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లోని నరేందర్ నివాసానికి తన ప్రత్యేక దూత ద్వారా పుష్పగుచ్ఛంతో పాటు శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పంపిన సందేశంలో, భారత రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి నన్నపునేని నరేందర్ చేస్తున్న కృషి, పార్టీ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అమోఘమని పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన నాయకుల కృషి వల్లే పార్టీ ప్రజల గుండెల్లో బలంగా నిలిచిందని కొనియాడారు.
ఈ పుట్టినరోజు నరేందర్ జీవితంలో మరింత ఆనందం, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ భవిష్యత్తులోనూ పార్టీకి, ప్రజలకు మరింత సేవ చేయాలని అభిలషించారు.
కేటీఆర్ పంపిన పుష్పగుచ్ఛం, శుభాకాంక్షల గ్రీటింగ్‌ను నన్నపునేని నరేందర్ స్వీకరించి, ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
