Regonda | పెండింగ్ బిల్లులు చెల్లిoచాలి

Regonda | పెండింగ్ బిల్లులు చెల్లిoచాలి
- ఎమ్మెల్యేకి మాజీ సర్పంచ్‌ల వినతి
Regonda | రేగొండ, ఆంధ్రప్రభ : మండలంలోని సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును ఉమ్మడి కొత్తపల్లి గోరి మండలంలోని గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు శనివారం ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు గ్రామపంచాయతీలలో సర్పంచులు పెట్టిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు దండబోయిన సంతోష్, జూపక నీలాబారం, దేవునూరి శ్రీనివాస్, లింగంపల్లి రాజు, సుధానబోయిన విష్ణు, కోమిడి కొమురరెడ్డి, మాచర్ల ఐలయ్య పాల్గొన్నారు.
