మండాది గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

వెల్దుర్తి , ఆంధ్రప్రభ: గత పాలకుల నిర్లక్ష్యమే మండాది గ్రామ ప్రజలకు శాపంగా మారిందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మండాది గ్రామ ఎస్సీ కాలనీలో కూటమి పార్టీలు నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం ప్రతి ఇంటికి మీ జూలకంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరై ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.

కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని ప్రజలకు కరపత్రాలు అందజేసి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గతంలో వైసీపీ పాలన కారణంగానే మండాది గ్రామం అభివృద్ధిలో వెనుకబడిందని తెలిపారు. దాదాపు రూ. 8 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని త్వరలో ప్రతిపాదన తయారుచేసి పనులు ప్రారంభిస్తామని మండాది ప్రజలకు తెలిపారు. అలానే డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా తాగునీటి ఎద్దడిని పూర్తిగా అరికడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ అలుగుమల్లి సంజీవరెడ్డి, మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజ బోయిన మల్లేశ్వరి , మధు యాదవ్ వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాస్ యాదవ్, వెల్దుర్తి మండల మాజీ జడ్పిటిసి కళ్ళం రామాంజిరెడ్డి , వెల్దుర్తి మండలం మాజీ టీడీపీ అధ్యక్షులు గుజ్జుల పాపిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు.