బడిబాట కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో సత్ఫలితాలు

విద్యార్థుల చేరికలను పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

బాల్కొండ నియోజకవర్గం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో సత్ఫలితాలను అందిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 5,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, ఇంగ్లీష్ మీడియం, మెరుగైన మౌలిక వసతులు, డిజిటల్ విద్యా సౌకర్యాలు వంటి అనేక అంశాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి.ఈ ఫలితాలతో మా జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం.

ఇది ఒక్కరి విజయం కాదు. విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,సిఆర్పిలు అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు మరియు ప్రజల సమిష్టి కృషి ఫలితం.“ప్రతి బిడ్డ బడిలో – ప్రతి బడి అభివృద్ధిలో” అనే లక్ష్యంతో బడిబాట కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తూ, బడి బయట ఉన్న ప్రతి పాఠశాల వయస్సు బాలబాలికను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసమే మా బడిబాట విజయానికి నిజమైన కొలమానం.అంతేకాకుండా గత సంవత్సరము అడ్మిషన్స్ కంటే ఈ సంవత్సరము 10 శాతం అదనంగా ప్రభుత్వ బడుల్లో నమోదు చేయుటకు టార్గెట్ ను నిర్ణయించడం జరిగింది అందులో చాలా మండలాలు విజయవంతం అయ్యాయి