అభివృద్ధిలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం..
- 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్
పాయకాపురం, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో స్థానిక64వ డివిజన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు.ఏన్నో ఏళ్లక్రితం నిర్మించిన మంచినీటి సరఫరా పైపు లైన్లు తుప్పుపట్టి చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి.వర్ష ప్రభావం వలన అప్పుడప్పుడు మంచినీరు కలుషితం అవుతున్నాయి.స్థానికులు ఈ సమస్యను డివిజన్ అధ్యక్షుడు రవికుమార్ దృష్టికి తీసుకొని వచ్చారు.వెంటనే ఈసమస్యను ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని, ఆయన సంబందిత అధికారికి ఆసమస్యను పరిష్కారించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని రవికుమార్ పేర్కొన్నారు.మంగళవారం మంచినీటి పైపు లైన్‌కి సంబంధించిన నూతన పైపులైన్ల నిర్మాణం వీఎంసీ సిబ్బంది చేపట్టారు.నిర్మాణపు పనులను డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె.రవికుమార్,అధికారులు పరిశీలించారు.నాణ్యత ప్రమాణాలు పాటించాలని వారు ఆదేశించారు.
