వైభవంగా గౌండ్ల కులస్థుల బోనాల ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు.. వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో గౌండ్ల కులస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా సదాశివపేట పట్టణంలోని దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన నిర్మల జగ్గారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గౌండ్ల కులస్థులు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేణుక చిరు, కౌన్సిలర్ నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన గౌండ్ల కులస్థుల బోనాల వేడుకల్లో నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పోతరాజుల విన్యాసాలు, గొర్రె పొట్టేళ్లతో అలంకరించిన ఫలహారం బండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ జోగిని అవికా బోనం ఎత్తుకుని పాల్గొనడం ఉత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఈ కార్యక్రమంలో గౌండ్ల సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేందర్ చక్రవర్తి గౌడ్, సురేందర్ గౌడ్, నక్క నాగరాజు గౌడ్, ఆర్. సుధాకర్ గౌడ్, దుర్గా గౌడ్, భరత్ గౌడ్, ఫణి, కిరణ్, శ్రీకాంత్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
