చౌటుప్పల్‌లో ముమ్మరంగా అభివృద్ధి పనులు

పలు వార్డుల్లో డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్, మోరీ నిర్మాణ పనులకు శ్రీకారం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా పనులకు శంకుస్థాపనలు చేశారు.

8వ వార్డులో కౌన్సిలర్ బద్రి గాలయ్యతో కలిసి కోట మైసమ్మ గుడి వెనుక డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. 7వ వార్డులో కౌన్సిలర్ కాసర్ల మంజులతో కలిసి సుందరయ్య కాలనీ రోడ్ నంబర్-11లో తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.

17వ వార్డులో కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలుతో కలిసి రెండు ట్యాంకుల సమీపంలో ఇంటింటికీ నీటి సరఫరా కోసం పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. 20వ వార్డులో కౌన్సిలర్ మహమ్మద్ హన్నుతో కలిసి బంగారిగడ్డ రోడ్ నంబర్-14 కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

12వ వార్డులో కౌన్సిలర్ పాక చిరంజీవితో కలిసి నవ్య హాస్పిటల్ సమీపంలో పెద్ద మోరీ నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో పార్టీలకు అతీతంగా చౌటుప్పల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎండి బాబా షరీఫ్, పస్తం గంగారాం, షేక్ నబీబి జానీ బాబు, సందగళ్ల విజయ సతీష్ గౌడ్, నాయకులు, కాలనీల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.