బెజ్జంకి పీహెచ్‌సీని పరిశీలించిన ప్రత్యేక అధికారి

బెజ్జంకి, ఆంధ్రప్రభ: బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్, ఎంఫీడీవో ప్రవీణ్, ఎంపీఓ ఖలీల్‌లు కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెరుగుతున్న జ్వర కేసులు, సీజనల్ వ్యాధుల పరిస్థితి, ల్యాబ్ పరీక్షల నిర్వహణపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం వైద్యాధికారి డాక్టర్ మాధురి, సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వ్యాధుల నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సులోచన, ఏఎన్‌ఎంలు అనిత, సరోజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.