వరద నీటితో కళకళలాడుతున్న కౌలాస్ నాల ప్రాజెక్టు

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: జుక్కల్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జుక్కల్ మండలంలోని కౌలాస్ నాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. మంగళవారం ఉదయం మరో 555 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లు ప్రాజెక్టు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 456.20 మీటర్ల మేర నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కౌలాస్ నాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరువ కావడంతో జలాశయం నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరడంతో రైతులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.