@6lakhs-Baby-Sale : అంగ‌డిలో ప‌సి గుడ్డు Andhra Prabha Crime News

@6lakhs-Baby-Sale : అంగ‌డిలో ప‌సి గుడ్డు Andhra Prabha Crime News

  • రూ.6.59 లక్షలకు బేరం
  • ఢిల్లీ లేడీ డీల్‌.. బీ్హారీ టాస్క్
  • బెజ‌వాడ‌లో ముగ్గురి ప‌ట్టివేత‌
  • 3 రోజుల ఆడ‌బిడ్డ‌ స్వాధీనం

( ఆంధ్ర‌ప్ర‌భ‌, విజ‌య‌వాడ (కృష్ణ‌లంక‌)

@6lakhs-Baby-Sale : విజయవాడలో శిశువు కొనుగోలు కేసును పోలీసులు ఛేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. కృష్ణలంకలోని రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో నిందితులు కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులతో పాటు బీహార్‌కు చెందిన సయ్యద్ ఆలంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి మూడు రోజుల వయసున్న ఆడ శిశువును స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు కలగకపోవడంతో ఢిల్లీకి చెందిన ఓ మహిళ ద్వారా రూ.6.59 లక్షలు చెల్లించి శిశువును కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శిశువును విక్రయించిన మహిళతో పాటు ఇతరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.