ఎర్రపహాడ్‌లో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదిన వేడుకలు

విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు, చాక్లెట్ల పంపిణీ

తాడ్వాయి, ఆంధ్రప్రభ: ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదిన వేడుకలను తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించినట్లు తాడ్వాయి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గైని రాజలింగం తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గైని రాజలింగం మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొంటికె మల్లవ్వ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హారాలి కిషన్‌రావు, మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.