ప్రతి ఇంటికీ ఆరు మొక్కల పంపిణీ
అంకిరెడ్డిగూడెంలో ఉపాధి హామీ నర్సరీ మొక్కల పంపిణీ ప్రారంభం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో వీబీజీ–రాంజీ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ నర్సరీలో పెంచిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ నర్సరీలో పెంచిన సుమారు పది రకాల పూలు, పండ్ల మొక్కలను ప్రతి ఇంటికి ఆరు చొప్పున ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పంపిణీ చేసిన మొక్కలను నాటి శ్రద్ధగా సంరక్షించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వలందాస్ మహేష్ గౌడ్, వార్డు సభ్యులు బత్తుల అనుష మహేష్ గౌడ్, పాలెం వెంకటేశం గౌడ్, ముద్దం లింగస్వామి గౌడ్, దొడ్ల అండాలు శేట్టయ్య గౌడ్, దండుగల వెంకటేశం, బొమ్మని శ్రావణి స్వామి గౌడ్, రాపోలు రేణుక మల్లేశం, గ్రామపంచాయతీ కార్యదర్శి గంగాపురం పాండు గౌడ్, సిబ్బంది ముద్దం మంజుల, పెండెం లక్ష్మి, గంగిరెడ్డి రజిత, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాపోలు యాదయ్య, రమణారెడ్డి, బిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
