Bhogapuram | విమానాశ్రాయాన్ని ప్రారంభించిన ప్రధాని..

ఆధునిక సదుపాయాలు, ఏవియేషన్ హబ్ మాస్టర్ ప్లాన్ పరిశీలన


Bhogapuram | ఆంధ్రప్రభ, విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, ప్రయాణికుల కోసం కల్పించిన సౌకర్యాలు, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. అలాగే విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా ప్రధాని పరిశీలించి వాటి పురోగతిపై ఆరా తీశారు.