చిట్టిగారి పార్క్ పరిసరాల్లో చెత్త చెదారం..
పరిశుభ్రత లేని పార్క్ పరిసరాల
డ్రై డే ఫ్రైడే నాడు పరిశుభ్రత పాటించని సిబ్బంది
చిట్టినగర్, ఆంధ్రప్రభ : ప్రజలకు పార్క్ లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం పరిసరాల పరిశుభ్రత. దానికి భిన్నంగా విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 47 వ డివిజన్ లో ఉన్న చిట్టిగారి పార్క్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. చిట్టిగారి పార్క్ కె.టి రోడ్డు వంటి ప్రధాన రహదారి లో ఉంటుంది. ఇలాంటి మెయిన్ రోడ్డు లో అది కూడా నగర పాలక సంస్థ పరిశుభ్రత కు ప్రాముఖ్యత ఇచ్చే డ్రై డే ఫ్రైడే పాటించే శుక్రవారం నాడు చెత్తాచెదారం పేరుకుపోవడం తో అటు వెళ్ళి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

చిట్టిగారి పార్క్ గేట్ రెండు వైపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ క్రింద ధర్మోకోల్ వ్యర్థాలు పెట్టి ఉన్నాయి. మెయిన్ రోడ్ లోనే ఇలా డంపర్ బిన్ నిండి క్రింద చెత్తాచెదారం ఉంటే ఇక సందుల్లో, కొండ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెయిన్ రోడ్ లో ఉన్న పార్క్ ముందు ఇలా అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఉండటంతో పార్క్ సందర్శకులు చెత్తా చెదారాన్ని చూసి విజయవాడ నగరానికి స్వచ్ఛత విషయం లో అవార్డులు వచ్చాయా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలంలో చెత్తాచెదారం పేరుకపోతే దోమలు వ్యాప్తి చెంది మలేరియా డెంగీ వంటి వ్యాధులు ప్రభలడానికి అవకాశం ఉంది.
విజయవాడ నగరంలో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ క్షేత్రస్థాయిలో ప్రతి రోజూ ఉదయం పర్యాటన సందర్భంగా సిబ్బంది కి పరిశుభ్రత పాటించాలి ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తుంటారు. అయిన సిబ్బంది ఆలసత్వం వహిస్తున్నారు అని పార్క్ వద్ద ఉన్న చెత్తాచెదారాన్ని చూస్తే అర్థమవుతుంది.రోజు డివిజన్ లో తిరగవలసి సచివాలయం శానిటరీ సెక్రటరీ ఇటు వైపు తొంగి చూడటం లేదు అని స్థానికులు చెబుతున్నారు. మెయిన్ రోడ్ లో ఉన్న చిట్టి గారి పార్క్ ముందు ఉన్న చెత్తాచెదారాన్ని ప్రతి రోజూ తొలగించాలని సందర్శకులు, స్థానికులు కోరుతున్నారు.
