ప్రజల గడప వద్దకే పాలన.. ప్రతి వినతికి పరిష్కారమే లక్ష్యం

  • టిడిపి పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి బుద్ధ వెంకన్న
  • పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్‌కు విశేష స్పందన
  • పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం తదితర అంశాలపై వినతుల స్వీకరణ
  • అర్హులందరికీ ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

(భవానిపురం, ఆంధ్రప్రభ) : ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ప్రధాన లక్ష్యం. ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం అని,ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 52వ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో బుద్ధా వెంకన్న పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు తదితర అంశాలపై ప్రజలు సమర్పించిన వినతులను ఆయన పరిశీలించారు. ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజలకు ప్రభుత్వ పాలనను మరింత చేరువ చేయడమే ప్రజా దర్బార్ ఉద్దేశమని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.

ప్రజలు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్ మల్లెల ఈశ్వర్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర చంటి, 52వ డివిజన్ అధ్యక్షులు ఈగల సాంబ, నల్లబిల్లి కనకారావు, గణప రాము, పాలాంటి గంగాధర్, సోలంకి రాజు, చీపుళ్ల వెంకటేశ్వరరావు, గోలి శ్రీను, అశోక్, దేవర కళ్యాణ్, నాగోతి వెంకటేష్, రమేష్ నాయుడు, మాచర్ల నరసింహారావు, దుర్గారావు, డివిజన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.