ఆలేరులో న్యూడెమోక్రసీ ర్యాలీ
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ జరిగింది. నాయకులు మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్రజలు రెవెన్యూ డివిజన్ గా ఆలేరును కోరుతున్నందున ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
