భారీ వర్షాలతో ఉప్పొంగిన గుడిపల్లి వాగు
వికారాబాద్, ఆంధ్రప్రభ: గత వారం రోజులుగా వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మున్సిపల్ పరిధిలోని గుడిపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాగులో ప్రవాహం పెరిగి పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో సమీపంలోని పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. వాగు వద్దకు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. గతంలో కురిసిన వర్షాలతోనూ ఇదే విధంగా గుడిపల్లి వాగు ఏరులై పారినట్లు స్థానికులు తెలిపారు.
